logo

రెండున్నర గంటల పాటు నిలిచిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌

న్యూదిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో ఆదివారం రాత్రి 2.36 గంటల పాటు వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ఆగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 27 May 2024 04:36 IST

చింతలపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ 

గిర్మాజీపేట, న్యూస్‌టుడే: న్యూదిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో ఆదివారం రాత్రి 2.36 గంటల పాటు వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ఆగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ లోకో ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా బోగీల్లోని ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో సాంకేతిక లోపాన్ని పరిశీలించి మరమ్మతులు చేసేందుకు రైల్వే అధికారులు రైలును సాయంత్రం 7.19 గంటలకు వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. లోకో ఇంజిన్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌ను తొలగించి, ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు అమర్చారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ను ఇంటర్‌సిటీకి అమర్చి ఆదివారం రాత్రి 9.55 గంటలకు పంపించారు. రెండున్నర గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు చింతపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపి ఉంచిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు కనీస వసతులు లేక సుమారు 3 గంటలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు