logo

మానవ అక్రమ రవాణా కేసులో మరో ఇద్దరి అరెస్టు

విదేశాల్లో ఆకర్షణీయ జీతం ఇప్పిస్తామని చెప్పి కాంబోడియాకు నిరుద్యోగులను తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన విషయం విదితమే.

Published : 27 May 2024 04:39 IST

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : విదేశాల్లో ఆకర్షణీయ జీతం ఇప్పిస్తామని చెప్పి కాంబోడియాకు నిరుద్యోగులను తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన విషయం విదితమే. విదేశాంగ శాఖ చొరవతో ఇప్పటి వరకు 25 మందిని కాంబోడియా నుంచి విశాఖకు తీసుకువచ్చారు. ఈ కేసులో మరింత దర్యాప్తు చేపట్టగా, గాజువాకకు చెందిన ఏజెంట్ కె.వీరేంద్రనాథ్‌(37), 2023 నుంచి 17 మందిని కాంబోడియా పంపించినట్లు గుర్తించారు. వీరేంద్రనాథ్‌ ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షల చొప్పున వసూలు చేసి, తన కమీషన్‌ కింద రూ.30వేలు ఉంచుకుని నిరుద్యోగులను కాంబోడియా పంపించేవాడు. వీరేంద్రనాథ్‌తో పాటు మరో ఏజెంట్ కె.ప్రవీణ్‌కుమార్‌ను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు