logo

ఆ ఉద్యోగులకు 60ఏళ్లు దాటితే తొలగింపే..!

మహా విశాఖ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులకు 60 ఏళ్లు దాటితే తొలగించాలన్న ఉత్తర్వులు రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

Published : 27 May 2024 04:40 IST

కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులకు 60 ఏళ్లు దాటితే తొలగించాలన్న ఉత్తర్వులు రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. 2019లో జారీ చేసిన 25, 26 జీఓలతోపాటు, 2023లో జీవీఎంసీ పాలకవర్గం తీర్మానం మేరకు ఒప్పంద, పొరుగు, ఎన్‌ఎంఆర్, డైలీ వేజెస్, ఫుల్‌టైం, పార్టుటైం తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న వారిలో 60ఏళ్లు దాటిన వారిని ఇకపై తొలగించనున్నారు. ఆప్కోస్‌ (ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ అవుటÂ సోర్స్డ్‌) నిబంధనల మేరకు ఆయా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతున్న అధికారులు కొత్తగా కార్మికుల నియామకంలో మాత్రం నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. 60ఏళ్లు దాటిన వారిని తీసివేసిన తర్వాత ఆయా పోస్టులను అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈమేరకు రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని