logo

భవిత కేంద్రాలతో దివ్యాంగ చిన్నారులకు భరోసా

దివ్యాంగ చిన్నారులకు భవిత కేంద్రాలు భరోసా ఇస్తున్నాయని జిల్లా సహిత విద్య సమన్వయకర్త శకుంతల పేర్కొన్నారు.

Updated : 28 May 2024 01:56 IST

మరుపాకలో బాలికతో మాట్లాడుతున్న శకుంతల

రావికమతం, న్యూస్‌టుడే: దివ్యాంగ చిన్నారులకు భవిత కేంద్రాలు భరోసా ఇస్తున్నాయని జిల్లా సహిత విద్య సమన్వయకర్త శకుంతల పేర్కొన్నారు. మరుపాకలో దివ్యాంగ చిన్నారుల గుర్తింపు సర్వేను శుక్రవారం పర్యవేక్షించారు. సహిత విద్య ద్వారా అందిస్తున్న సేవలు, సదుపాయాలు, సౌకర్యాల కల్పనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జూన్‌ 9 వరకు సర్వే కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకు 327 మంది దివ్యాంగ చిన్నారులను గుర్తించామన్నారు. ఎంఈవోలు తలుపులు, బ్రహ్మానందం, ఉపాధ్యాయులు మహాలక్ష్మినాయుడు, జగన్నాథనాయుడు, సరోజని పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని