logo

ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో పూర్వికి చోటు

నగరంలో లిటిల్‌ ఏంజిల్స్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పూర్వి రజాక్‌కు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కింది.

Published : 28 May 2024 01:56 IST

భారతదేశ చిత్రపటంలో సంప్రదాయ వంటకాలను ప్రదర్శిస్తున్న పూర్వి రజాక్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే : నగరంలో లిటిల్‌ ఏంజిల్స్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పూర్వి రజాక్‌కు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కింది. పొడిమట్టిని ఉపయోగించి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాల సూక్ష్మ నమూనాలను ఈ విద్యార్థిని తయారు చేసింది. ఈ కళానైపుణ్యానికి పూర్వి రజాక్‌కు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు పొందుపరిచారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు