logo

కాంబోడియా నుంచి మరో 25 మంది వచ్చే అవకాశం

ఏజెంట్ల చేతిలో మోసపోయి కాంబోడియాలో ఇబ్బందులు పడుతున్న మరో 25 మందిని భారతదేశానికి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.

Published : 28 May 2024 02:03 IST

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : ఏజెంట్ల చేతిలో మోసపోయి కాంబోడియాలో ఇబ్బందులు పడుతున్న మరో 25 మందిని భారతదేశానికి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 25 మంది బాధితులను ఆ దేశం నుంచి మన దేశానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అలానే మరో 25 మందిని తీసుకువచ్చేందుకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో వీరు భారతదేశం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ అక్రమ రవాణా తరలింపు ప్రధాన ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  ఈ తరహాలో ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు ఉంటే వెంటనే సైబర్‌ క్రైమ్‌ సి.ఐ. భవానీ ప్రసాద్‌ (9490617917), పోలీసు కంట్రోల్‌రూమ్‌ (0891-2565454), నగర పోలీసు కమిషనర్‌ వాట్సాప్‌ నెంబరు(9493336633)లో సంప్రదించాలని నగర పోలీసులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు