logo

ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు

ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపునకు గుర్తించిన 21 హాళ్లలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Published : 28 May 2024 02:06 IST

పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన పెద్ద బల్లలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపునకు గుర్తించిన 21 హాళ్లలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 30వ తేదీ నాటికి ఆయా పనులు పూర్తి చేయాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా బల్లల ఏర్పాటు, ఇనుప మెష్‌ల నిర్మాణం, కేంద్రం లోపలికి ప్రవేశించే మార్గాల వద్ద భద్రతా చర్యలు, మెష్‌లతో కూడిన ప్రవేశమార్గాల ఏర్పాటు తదితర పనులపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు కేంద్రాలు, లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఏడు కేంద్రాలు, పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లకు మరో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపునకు పెద్ద బల్లలు వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 నుంచి 5 బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పోలైన బ్యాలట్‌ ఓట్ల సంఖ్య 23వేలకుపైగా ఉండడంతో 18 బల్లలు వేస్తున్నారు. లెక్కింపునకు ఎంపిక చేసిన హాళ్లలో వెలుతురు సరిగా ఉండేలా చూస్తున్నారు. హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎప్పటికప్పడు అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తున్నారు. లెక్కింపు కేంద్రం లోపలికి ఇతరులు వెళ్లే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని