logo

నావికాదళ దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు

నావికా దళ దినోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ జి.మల్లికార్జున అధికారులను ఆదేశించారు.

Published : 27 Nov 2022 05:04 IST

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌, నేవీ అధికారులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: నావికా దళ దినోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ జి.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 4న బీచ్‌రోడ్డులో నిర్వహించే ‘నేవీడే’ను  పురస్కరించుకొని శనివారం సాయంత్రం కలెక్టర్‌తో పాటు పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు ఏర్పాట్లు పరిశీలించారు. వీవీఐపీల వేదిక, డచ్‌ బిల్డింగ్‌ పరిశీలించి ఈ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. ఏపీఐఐసీ గ్రౌండ్లో పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రామకృష్ణా బీచ్‌లో సందర్శకుల సౌకర్యార్థం బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నేవీడేకు వచ్చే ప్రజలందరికీ నేవీ విన్యాసాలు కనిపించే విధంగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌, ఎస్డీసీలు రంగయ్య, అనిత, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌ సుధాకర్‌, సమాచార శాఖ జేడీ మణిరామ్‌, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ వర్మ, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని