logo

సీట్ల కోసం సిగపట్లు

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో తిరిగే రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండడం.. మరో పక్క ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు.

Published : 27 Nov 2022 05:04 IST

రైలు ముందు ఆందోళన చేస్తున్న ప్రయాణికులు

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో తిరిగే రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండడం.. మరో పక్క ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు అయ్యప్ప భక్తులు దాదాపు 4 నెలల ముందుగానే శబరిమల వెళ్లడానికి పలు రైళ్లలో సీట్లను రిజర్వు చేసుకున్నారు. ఆ రైళ్లు విశాఖ చేరుకునే సరికి దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయి.

* సీట్లను రిజర్వేషన్‌ చేయించుకున్న వారు బోగీల్లో కాలుపెట్టలేని పరిస్థితి. దీంతో పలువురు అయ్యప్ప భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు స్లీపర్‌ బోగీల్లో కోత.... మరోవైపు ప్రత్యేక రైళ్లు అందుబాటులో లేకపోవడంతో రైలు ప్రయాణాలు నరకప్రాయంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికులు, సాధారణ టికెట్లతో రిజర్వేషన్‌ బోగీల్లో ఉన్న ప్రయాణికులకు టీసీలు జరిమానా విధించి అదే బోగీల్లో ప్రయాణాలకు అనుమతిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కిక్కిరిసి విశాఖ స్టేషన్‌కు చేరుకుంటున్న రైళ్లపై వాల్తేర్‌ అధికారులు దృష్టి సారించారు. రిజర్వేషన్‌ టికెట్లు లేని ప్రయాణికులను స్టేషన్‌లో దించేస్తున్నారు.

* శనివారం 3వ నంబరు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన పట్నా-ఎర్నాకుళం, 4వ నంబరు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన ధన్‌బాద్‌-అల్పూజా బొకారో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో పలువుర్ని ఇలా కిందకు దించేశారు. దీంతో తామెలా వెళ్లాలని ప్రశ్నిస్తూ వారు ఆందోళనకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని