logo

ఏయూలో విద్యార్థి సంఘాల...వాగ్వాదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఇటీవల ఓ ఆంగ్ల ఛానల్‌ రూపొందించిన డాక్యుమెంటరీని ఆంధ్ర విశ్వవిద్యాలయం శాతవాహన వసతి గృహం వద్ద శుక్రవారం రాత్రి ఎస్‌.ఎఫ్‌.ఐ. ఆధ్వర్యంలో భారీ ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించడం వివాదాస్పదమైంది.

Published : 28 Jan 2023 05:02 IST

డాక్యుమెంటరీని తిలకిస్తున్న విద్యార్థులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఇటీవల ఓ ఆంగ్ల ఛానల్‌ రూపొందించిన డాక్యుమెంటరీని ఆంధ్ర విశ్వవిద్యాలయం శాతవాహన వసతి గృహం వద్ద శుక్రవారం రాత్రి ఎస్‌.ఎఫ్‌.ఐ. ఆధ్వర్యంలో భారీ ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించడం వివాదాస్పదమైంది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థులు వచ్చి డాక్యుమెంటరీ ప్రదర్శన నిలిపివేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెండు విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మూడో పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణ సద్దుమణిగేలా చేశారు. విషయం తెలుసుకున్న చీఫ్‌ వార్డెన్‌ వీర్రాజు చేరుకొని విద్యార్థులను వారి వారి వసతి గృహాలకు పంపించారు. ఏయూలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్నా.. ఈ డాక్యుమెంటరీని ఏ విధంగా ప్రదర్శించారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని