కేజీహెచ్‌లో జూనియర్ సహాయకునిపై చర్యలు
కేజీహెచ్‌లో అనధికారిక వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి జూనియర్ సహాయకుడు హరికుమార్‌ను సస్పెండ్ చేస్తూ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి.అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లో అనధికారిక వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి జూనియర్ సహాయకుడు హరికుమార్‌ను సస్పెండ్ చేస్తూ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి.అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హరికుమార్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు ఒప్పంద ఉద్యోగుల నుంచి మూమూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో ప్రధాన కారకుడైన హరికుమార్‌ను సస్పెండ్ చేసి, పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డాక్టర్ పి.అశోక్‌కుమార్ ఆసుపత్రి పరిపాలన విభాగ అధికారులను ఆదేశించారు. కేజీహెచ్ ల్యాబొరేటరీలో ఒప్పంద టెక్నీషియన్లుగా కొంతమంది సేవలందిస్తున్నారు. వారికి గత అయిదు నెలల నుంచి జీతాలు రాలేదు. వీరి జీతాల బిల్లును ట్రెజరీ కార్యాలయంలో అందజేశారు. అక్కడ క్లియరెన్సు కావాలంటే మామూళ్లు ఇవ్వాలంటూ ట్రెజరీ వ్యవహారాలను పర్యవేక్షించే హరికుమార్, మరో ఇద్దరు 20 మంది ఒప్పంద ఉద్యోగుల నుంచి రూ.5వేల చొప్పున వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మరికొంత అదనంగా చెల్లించాలని, లేకుంటే జీతాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఈ వివరాలు బయటపడడంతో వైద్యాధికారులు స్పందించారు. ఆసుపత్రి పరిపాలన విభాగ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు సెలవులో ఉన్నారు. ఆయన రాగానే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ముడుపుల విషయం తేల్చనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి