అప్పన్న స్వామికి మొక్కు చెల్లించిన పశ్చిమ ఎమ్మెల్యే
విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు సోమవారం సింహాద్రి అప్పన్న స్వామికి మొక్కు చెల్లించుకున్నారు.
పైడితల్లి అమ్మవారికి సారె తెస్తున్న ఎమ్మెల్యే గణబాబు
సింహాచలం, అడివివరం, న్యూస్‌టుడే: విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు సోమవారం సింహాద్రి అప్పన్న స్వామికి మొక్కు చెల్లించుకున్నారు. గోపాలపట్నంలోని ఆయన నివాసం నుంచి తోడపెద్దులు, గరిడీ బృందాలతో పాదయాత్రగా అడివివరం గ్రామానికి చేరుకున్నారు. విశాఖ పార్లమెంటు తెదేపా కార్యదర్శి పాశర్ల ప్రసాద్, 98వ వార్డు కార్పొరేటర్ పీవీ.నరసింహం, అడివివరం గ్రామ తెదేపా నాయకులు ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అప్పన్న స్వామి సోదరి పైడితల్లి అమ్మవారికి గణబాబు పసుపు కుంకుమలు, సారె సమర్పించారు. అనంతరం తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి మెట్లమార్గం గుండా సింహగిరికి చేరుకున్నారు. సతీసమేతంగా అప్పన్న స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం దేవస్థానం అతిథి గృహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌లీడర్ పీలా శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
దిగంబరత, అశ్లీలత ఒకటి కాదు: హైకోర్టు
-
Sports News
పోరాటం కొనసాగిస్తాం.. రైల్వే ఉద్యోగాల్లో చేరిన రెజ్లర్లు
-
Ts-top-news News
19 నుంచి రాష్ట్రమంతా హరితోత్సవం
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి
-
Sports News
Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు