logo

అప్పన్న స్వామి హుండీ ఆదాయం రూ. 2.06 కోట్లు

శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం మంగళవారం సింహగిరిపై జరిగింది. ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలను తెరిచి ఆదాయం లెక్కింపు చేపట్టారు.

Published : 29 Mar 2023 03:15 IST

ఆలయ బేడా మండపంలో హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం మంగళవారం సింహగిరిపై జరిగింది. ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలను తెరిచి ఆదాయం లెక్కింపు చేపట్టారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.2,06,11,210 సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. 100.600 గ్రాముల బంగారం, 12.495 కిలోల వెండి లభ్యమైనట్లు వివరించారు. ఈ మొత్తం ఆదాయం 40 రోజులదిగా తెలియజేశారు. హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం రెండో రోజూ కూడా కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని