logo

కొనసాగిన రైల్వేస్టేషన్‌ల తనిఖీ

రైల్వే బోర్డు నుంచి వచ్చిన ప్రయాణికుల సౌకర్యాల కమిటీ రెండో రోజు మంగళవారం వాల్తేర్‌ డివిజన్‌లో తనిఖీలు కొనసాగించిందని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

Published : 29 Mar 2023 03:15 IST

దార్లపుట్‌ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న బృందం

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: రైల్వే బోర్డు నుంచి వచ్చిన ప్రయాణికుల సౌకర్యాల కమిటీ రెండో రోజు మంగళవారం వాల్తేర్‌ డివిజన్‌లో తనిఖీలు కొనసాగించిందని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 30 వరకు డివిజన్‌ పరిధిలోని పలు స్టేషన్ల్‌ను కమిటీ పరిశీలిస్తుందన్నారు. మంగళవారం కొత్తవలస- కొరాపుట్‌ సెక్షన్‌లో పర్యటించిందని తెలిపారు. కమిటీ సభ్యులు దిలీప్‌ కుమార్‌ మల్లిక్‌, అభిజిత్‌ దాస్‌, నిర్మలా కిషోర్‌ బొల్లిన, గొట్టాల ఉమారాణి, డాక్టర్‌ జి.వి.మంజునాథ, తదితరులతో కూడిన బృందం గోరాపూర్‌, దార్లిపుట్‌, మచ్చకుంద రోడ్‌ స్టేషన్లు తనిఖీ చేశారన్నారు. తాగు నీటి సౌకర్యాలు, నిరీక్షణ గదులు, పుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు, క్యాటరింగ్‌ స్టాల్స్‌, తదితర సౌకర్యాలపై దృష్టి సారించారని పేర్కొన్నారు. డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ అవినాష్‌ శర్మ తదితరులు బృందానికి సహకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని