logo

ఘనంగా జబర్దస్త్‌ ఫేం ఆర్పీ వివాహం

జబర్దస్త్‌ ఫేమ్‌ రాచకొండ ప్రసాద్‌ (ఆర్‌.పి) వివాహ వేడుకలు నగరంలోని పామ్‌బీచ్‌ హోటల్‌లో బుధవారం సంప్రదాయబద్ధంగా జరిగాయి.

Updated : 30 Nov 2023 04:25 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: జబర్దస్త్‌ ఫేమ్‌ రాచకొండ ప్రసాద్‌ (ఆర్‌.పి) వివాహ వేడుకలు నగరంలోని పామ్‌బీచ్‌ హోటల్‌లో బుధవారం సంప్రదాయబద్ధంగా జరిగాయి. విశాఖ నగరానికి చెందిన ప్రసన్నతో ఆర్పీ వివాహమైంది. ప్రసన్న పైచదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లగా అక్కడ ఆర్పీతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో వీరు పెళ్లి చేసుకున్నారు. ప్రసన్న విశాఖ నగరంలోనే ఉంటుండటంతో ఇక్కడే వివాహం చేశామని బంధువులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని