logo

ప్రధానోపాధ్యాయినిపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఇంటర్‌ విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించడంపై ఎలమంచిలి బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని హిమబిందుపై ఎమ్మెల్యే రమణమూర్తి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 30 Nov 2023 04:25 IST

ఎలమంచిలి పట్టణం, న్యూస్‌టుడే: ఇంటర్‌ విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించడంపై ఎలమంచిలి బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని హిమబిందుపై ఎమ్మెల్యే రమణమూర్తి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 28న ఈ పాఠశాలలో సుమారు 600 మంది హైస్కూల్‌ విద్యార్థులు, 40 ఇంటర్‌, మరో 60 మంది ప్రాథమిక విద్యార్ధులు ఉన్నారు. అదే రోజు ఉపాధ్యాయులకు శిక్షణకు రెండు గదులు కేటాయించారు. దీంతో ఇంటర్‌ విద్యార్థులను స్థలాభావంతో నేలపై కూర్చోబెట్టారు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం ఆసుపత్రి భవనాలను ప్రారంభించేందుకు ఎలమంచిలి వచ్చిన ఎమ్మెల్యే పాఠశాల హెచ్‌ఎంను రోడ్డుపైకి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి ఎలా పరీక్ష రాయిస్తారని ప్రశ్నించారు. ‘ఎక్కడ నుంచి వచ్చావ్‌.. నా సంగతి తెలియదా’? అంటూ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని