logo

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు

జాతీయ రహదారి వెంబడి ప్రమాదాలు, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. పాయకరావుపేట పోలీసుస్టేషన్‌ను బుధవారం ఎస్పీ సందర్శించారు.

Published : 30 Nov 2023 03:41 IST

ఎస్పీ మురళీకృష్ణ

పాయకరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారి వెంబడి ప్రమాదాలు, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. పాయకరావుపేట పోలీసుస్టేషన్‌ను బుధవారం ఎస్పీ సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే కీలకమైన ప్రదేశాలను గుర్తించామన్నారు. వీటి వద్ద తీసుకోవాల్సిన భద్రతపరమైన చర్యలపై హైవే అథారిటీ ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చిస్తామన్నారు. వాహన చోదకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చోరీలను అరికట్టాలని ఆయా స్టేషన్‌ అధికారులకు సూచించామని పేర్కొన్నారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా సరిహద్దులో 5 ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న కీలకమైన కేసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని స్టేషన్‌ ఎస్సైలకు, సీఐలకు సూచనలు చేశామని వివరించారు. స్టేషన్‌లో పలు రికార్డులు తనిఖీ చేసి పెండింగ్‌ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐ అప్పలరాజు, ఎస్సైలు రమేష్‌, జోగారావు, ఏఎస్సై గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని