logo

మత్స్యశాఖ జేడీగా లాల్‌ అహ్మద్‌

జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు (జేడీ)గా ఎస్‌కే లాల్‌ అహ్మద్‌ బాధ్యతలు చేపట్టారు. 11 మంది జేడీలకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ మత్స్యశాఖ కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 02 Dec 2023 04:19 IST

కలెక్టర్‌కు మొక్క అందజేస్తున్న లాల్‌ అహ్మద్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు (జేడీ)గా ఎస్‌కే లాల్‌ అహ్మద్‌ బాధ్యతలు చేపట్టారు. 11 మంది జేడీలకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ మత్స్యశాఖ కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా జేడీగా పనిచేస్తున్న లాల్‌ అహ్మద్‌ను విశాఖ జిల్లాకు బదిలీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఇన్‌ఛార్జి జేడీ విజయ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మల్లికార్జునను మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొంత కాలం నుంచి జేడీ పోస్టు ఖాళీగా ఉంది. తాజా నియామకంతో ఎట్టకేలకు భర్తీ చేసినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని