logo

యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్‌

యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కర్ని ఓటరుగా చేర్చాలన్నారు.

Published : 06 Dec 2023 04:06 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కర్ని ఓటరుగా చేర్చాలన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీఓలు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలు, ఎంపీడీఓలు, బీఎల్‌ఓలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్‌ మాట్లాడారు. రానున్న మూడు రోజుల్లో కళాశాల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించి అక్కడికక్కడే ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలు, బీఎల్‌ఓల వివరాలను కళాశాలలకు అందజేస్తామన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. సమావేశంలో డీఆర్వో కె.మోహన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని