logo

వైద్యారోగ్యశాఖలో అక్రమ నియామకాలపై విచారణ

వైద్యారోగ్యశాఖలో ఇదివరకు చేపట్టిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని,  అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగింది.

Published : 06 Dec 2023 04:06 IST

ఈనాడు, విశాఖపట్నం: వైద్యారోగ్యశాఖలో ఇదివరకు చేపట్టిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని,  అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగింది. కొవిడ్‌ సమయంలో ఇష్టానుసారంగా ఖాళీలు భర్తీచేశారని, స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు  రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారని, విమ్స్‌ పోస్టుల భర్తీలోను అక్రమాలకు పాల్పడ్డారని, అయిదుగురు అనస్తీషియా నిపుణుల నియామకానికి డబ్బులు దండేశారని, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో సామగ్రి కొనుగోలులో చేతివాటం చూపినట్లు అప్పటి డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, నియామక ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన ఎస్‌ఎఫ్‌ రవీంద్ర, అప్పటి సీనియర్‌ అసిస్టెంట్ ఐవీఎస్‌ ఆచారి, డా.శ్రీధర్‌పై అభియోగాలు మోపారు. వాటిపై కొంతకాలంగా విచారణలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం మరోసారి విశాఖలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జాతీయ కుష్ఠు నియంత్రణ కార్యక్రమం అదనపు డైరెక్టర్‌, కేజీహెచ్‌ సహాయ సంచాలకులు, విజిలెన్స్‌ పరిపాలనా అధికారి (ఏవో) కలిసి విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో పలు దస్త్రాలను పరిశీలించి వివరణలు అడిగినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని