logo

‘భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం’

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం లోపభూయిష్టంగా ఉందని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు అన్నారు.

Published : 06 Dec 2023 04:09 IST

మాట్లాడుతున్న న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం లోపభూయిష్టంగా ఉందని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదుల సంఘం గ్రంథాలయం హాలులో మంగళవారం ఉదయం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలను న్యాయవ్యవస్థ నుంచి దూరం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారన్నారు. రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు కె.రామజోగేశ్వరరావు మాట్లాడుతూ బార్‌కౌన్సిల్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్లామని, త్వరలో కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోగలదన్నారు. మరో సభ్యుడు పి.నరసింగరావు మాట్లాడుతూ ఈ చట్టం అమలులోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. గురువారం ఉదయం కూడా నిరసన తెలియజేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు సంఘం కార్యదర్శి పైలా శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.ఎస్‌.ఎన్‌.రాజు, జె.పృథ్విరాజ్‌, ఎన్‌.వెంకటేశ్వరరావు, డి.మంజులత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని