logo

లోతట్టు ప్రాంతాలు జలమయం

తీరం దాటిన తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మధురవాడ పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేని వర్షం కురిసింది.

Published : 06 Dec 2023 04:21 IST

కోతకు గురైన తీరం..

మధురవాడ, కొమ్మాది, న్యూస్‌టుడే: తీరం దాటిన తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మధురవాడ పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేని వర్షం కురిసింది. మధురవాడ మార్కెట్ పరిసర ప్రాంతాలతో పాటు స్వతంత్రనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి జలమయమైంది. మధురవాడ పైవంతెన, చంద్రంపాలెం, కారుషెడ్డు కూడళ్లలోని సేవామార్గాల్లో వర్షపు నీరు ప్రవహించింది. సమీపంలో ఉన్న మురుగునీటి కాలువలు వ్యర్థాలతో నిండి పోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివాజీపాలెంలో ఓ అపార్ట్‌మెంట్‌  ప్రహరీ కూలిపోయింది. కేఆర్‌ఎం కాలనీలో గెడ్డ పొంగి వీధుల్లో నీరు ప్రవహించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

గాజువాక కణితి మార్కెట్‌లో...

శివాజీపాలెంలో కూలిన  ఓ అపార్టుమెంట్‌ ప్రహరీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని