logo

పలు రైళ్ల దారి మళ్లింపు

దక్షిణ మధ్య రైల్వే కాజీపేట-కొండపల్లి సెక్షన్‌ వరంగల్‌ స్టేషన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

Published : 06 Dec 2023 04:23 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వే కాజీపేట-కొండపల్లి సెక్షన్‌ వరంగల్‌ స్టేషన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

  • ఈ నెల 16,17 తేదీల్లో షాలిమార్‌-హైదరాబాద్‌(18045), 17,18 తేదీల్లో హైదరాబాద్‌- షాలిమార్‌(18046) ఈస్ట్‌కోస్‌ ఎక్స్‌ప్రెస్‌, 6,7, 9 నుంచి 17 తేదీల వరకు విశాఖపట్నం-ముంబయి(18519) ఎల్‌టీటీ, 10 నుంచి 18వ తేదీ వరకు ముంబయి-విశాఖ(17520) ఎల్‌టీటీ.., 16,17 తేదీల్లో భువనేశ్వర్‌-సీఎస్‌టీ ముంబయి(11020), సీఎస్‌టీ ముంబయి-భువనేశ్వర్‌(11019) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లు వయా పగిడిపల్లి-గుంటూరు-విజయవాడ మార్గంలో నడుస్తాయన్నారు.
  • ఈ నెల 9 నుంచి 17వరకు విశాఖ-న్యూదిల్లీ(20805), న్యూదిల్లీ-విశాఖ(20806) ఏపీ ఎక్స్‌ప్రెస్‌, 7 నుంచి 14 వరకు విశాఖ-గాంధీధామ్‌(20803), 10 నుంచి 17వరకు గాంధీధామ్‌-విశాఖ(20804), పూరీ-ఓఖా(20819), 6 నుంచి 13 వరకు ఓఖా-పూరీ(20820), 11,15,18 తేదీల్లో విశాఖ-హజ్రత్‌ నిజాముద్దీన్‌(12803), 10,13,17 తేదీల్లో హజ్రత్‌ నిజాముద్దీన్‌-విశాఖ(12804) రైళ్లు వయా విజయనగరం, రాయగడ, రాయపూర్‌, నాగ్‌పూర్‌ మార్గంలో నడుస్తాయని పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని