logo

ఖాతాదారుల సేవా కేంద్రంలో చోరీ

నాగయ్యపేట శివారు సీతంపేటలోని ఏపీజీవీబీ ఖాతాదారుల సేవా కేంద్రంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి రూ.3.5 లక్షల నగదు ఎత్తుకుపోయారు.

Published : 06 Dec 2023 04:24 IST

వివరాలు సేకరిస్తున్న సీఐ తాతారావు, ఎస్సై నాగేంద్ర

దేవరాపల్లి, న్యూస్‌టుడే: నాగయ్యపేట శివారు సీతంపేటలోని ఏపీజీవీబీ ఖాతాదారుల సేవా కేంద్రంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి రూ.3.5 లక్షల నగదు ఎత్తుకుపోయారు. సీఐ తాతారావు, ఎస్సై నాగేంద్ర అందించిన వివరాల ప్రకారం.. నాగయ్యపేటకు చెందిన కొయినాన శ్రీరామ్మూర్తి ఏడాదిగా సీతంపేటలో ఓ షాపు అద్దెకు తీసుకుని సేవా కేంద్రం నిర్వహిస్తున్నాడు. నగదు చెల్లింపులతోపాటు ఆన్‌లైన్‌ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని దుకాణంలోనే భద్రపరుస్తుంటాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి షట్టరుకు తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు షట్టరు తెరిచి ఉండటం గమనించిన కొందరు శ్రీరామ్మూర్తికి సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే 100కి ఫోను చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఎస్‌.తాతారావు, ఎస్సై పోలీసు జాగిలాలు, క్లూస్‌టీంతో అక్కడకు చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని