logo

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

తుపాను వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలుస్తామన్నారు.

Published : 07 Dec 2023 02:59 IST

ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: తుపాను వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలుస్తామన్నారు. ఈ విషయపై ఇప్పటికే సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారన్నారు. తారువలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. తుపాను గురించి వాతావరణ శాఖ అందించిన ముందస్తు సమాచారంతో సీఎం జగన్‌ యంత్రాంగాన్ని అన్నివిధాలా సన్నద్ధం చేశారన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారన్నారు. మాడుగుల నియోజక వర్గంలోని నాలుగు మండలాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని