logo

పార్టీల సహకారంతో ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ

రాజకీయ పార్టీల సహకారంతో ఓటర్లు జాబితా స్వచ్ఛీకరణ చేపడుతున్నామని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Published : 07 Dec 2023 03:03 IST

కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాజకీయ పార్టీల సహకారంతో ఓటర్లు జాబితా స్వచ్ఛీకరణ చేపడుతున్నామని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఈనెల 5 వరకు ఫారం-7లు 16007, ఫారం-8లు 22726 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల్లో దరఖాస్తులు అందాయన్నారు. ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ లక్ష్మీదేవి, డీటీ రవికుమార్‌, తులసీరామ్‌ పాల్గొన్నారు.

ఈవీఎంల ప్రదర్శన

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఈవీఎంల డెమో ప్రదర్శన బుధవారం చేపట్టినట్లు ఆర్డీవో చిన్నికృష్ణ తెలిపారు. ఈవీఎంలను ఎలా వినియోగించాలనే విషయంపై ఓటర్లలో అవగాహన కల్పించేలా డెమో చేపడుతున్నారు. దీంట్లో భాగంగా ఆర్డీవో కార్యాలయం వద్ద ప్రారంభించి అనకాపల్లి నియోజకవర్గంలో 121 ప్రదేశాల్లో ప్రదర్శన ఇస్తున్నట్లు వివరించారు.  


నేడు ఎలక్టోరల్‌ పరిశీలకులు యువరాజ్‌ పర్యటన

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఎలక్టోరల్‌ పరిశీలకులు డా.ఎన్‌.యువరాజ్‌ గురువారం జిల్లాలో పర్యటించనున్నారని డీఆర్వో బి.దయానిధి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో, 11 నుంచి 12 వరకు ఈఆర్‌ఓలతో సమావేశం ఉంటుందన్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్షేత్రస్థాయిలోని పోలింగ్‌ కేంద్రాల్లో పర్యటిస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని