logo

మంత్రికి రైతుల కష్టాలు కనిపించవా?

తుపానుకు దెబ్బతిన్న చెరకు, వరి పంటలకు ఎకరాకు రూ. 30 వేలు పరిహారంగా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మంత్రి అమర్‌నాథ్‌కు రైతుల కష్టాలు కనిపించడం లేదన్నారు.

Published : 07 Dec 2023 03:06 IST

అనకాపల్లి, న్యూస్‌టుడే: తుపానుకు దెబ్బతిన్న చెరకు, వరి పంటలకు ఎకరాకు రూ. 30 వేలు పరిహారంగా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మంత్రి అమర్‌నాథ్‌కు రైతుల కష్టాలు కనిపించడం లేదన్నారు. తుపానుకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. హుద్‌హుద్‌ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలోనే ఉండి క్షేత్రస్థాయిలో పనిచేశారని గుర్తు చేశారు. అందుకే తక్కువ సమయంలోనే విద్యుత్తు, తాగునీరు వంటి సదుపాయాలు ప్రజలకు అందించగలిగారన్నారు. తుపానులకు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం సరైన పరిహారం అందివ్వడం లేదన్నారు. తెదేపా హయాంలో వరికి ఎకరాకు రూ.20వేలు ఇస్తే వైకాపా ప్రభుత్వం రూ. 15 వేలు ఇస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని