logo

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ రవి, ఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు.

Published : 07 Dec 2023 03:08 IST

కలెక్టరేట్, న్యూస్‌టుడే: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ రవి, ఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న తుపాను సహాయక చర్యలను వివరించారు. అనంతరం జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వెబ్‌ఎక్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గురువారం కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయక కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు.  తుపాను కారణంగా గత మూడు రోజులుగా 205 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని కలెక్టర్‌ రవి తెలిపారు. 32,091 ఎకరాల్లో వరి పంట, 96.80 ఎకరాల్లో కూరగాయలు, 70.80 ఎకరాల్లో తమలపాకుల తోటలు నీటి ముంపులో ఉన్నాయన్నారు. మాడుగుల, చీడికాడ, అనకాపల్లి, రావికమతం మండలాల్లో నాలుగు జెర్సీ ఆవులు మరణించాయన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 4 పక్కా ఇళ్లు, 12 పూరిళ్లు, 9 పూరిగుడిసెలు పూర్తిగా, 86 పూరిల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. 409 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి సౌకర్యాలు కల్పించామన్నారు. 38 విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 54 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టాల అంచనాకు సంబంధిత శాఖల అధికారులు నిమగ్నమయ్యారన్నారు. వీలైనంత త్వరగా పంట నష్టపరిహారం రైతులకు అందివ్వాలన్నారు. ఏఎస్పీ విజయ భాస్కర్‌, సీపీవో రామారావు, వ్యవసాయశాఖ జేడీ రామారావు, డీఎంహెచ్‌వో హేమంత్‌, డీపీవో శిరీషారాణి, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని