logo

హోంగార్డుల సేవలు అభినందనీయం

హోంగార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. అనకాపల్లిలో బుధవారం హోంగార్డుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ 1962లో తొలిసారిగా అత్యవసర...

Published : 07 Dec 2023 03:13 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: హోంగార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. అనకాపల్లిలో బుధవారం హోంగార్డుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ 1962లో తొలిసారిగా అత్యవసర సమయంలో పోలీసులకు సహకరించేందుకు హోంగార్డు వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాటి నుంచి పోలీస్‌ విధుల్లో హోంగార్డులు భాగస్వాములై ప్రజలకు సేవలకు అందిస్తున్నారని కొనియాడారు. గంజాయి రవాణా, నాటుసారా, చోరీ కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన హోంగార్డులు ఆర్‌.రాంబాబు, బాబాషేక్‌ ముస్కిన్‌ మదీనా, పి.ఈశ్వరరావు, ఎన్‌.పైడంనాయుడు, బి.త్రినాథరావు, ఎస్‌.సన్నిబాబులకు జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఏఎస్పీలు విజయభాస్కర్‌, సత్యనారాయణ, అనకాపల్లి డీఎస్పీ సుబ్బరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని