logo

బీసీగేటు దారి.. నిత్యం సవారీ..!

నిత్యం రద్దీగా ఉండే గాజువాక- స్టీల్‌ప్లాంట్‌ బీసీగేటు ప్రధాన రహదారికి ఇరువైపులా అనధికార వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. దీంతో నిత్యం విధులకు వెళ్లే ఉక్కు కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు.

Published : 07 Dec 2023 03:15 IST

న్యూస్‌టుడే, పెదగంట్యాడ: నిత్యం రద్దీగా ఉండే గాజువాక- స్టీల్‌ప్లాంట్‌ బీసీగేటు ప్రధాన రహదారికి ఇరువైపులా అనధికార వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. దీంతో నిత్యం విధులకు వెళ్లే ఉక్కు కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. గంగవరం పైవంతెన మొదలుకొని సీతానగరం కొండ, బీసీ గేటు వరకు ట్యాంకర్లు, లారీలు, టిప్పర్లు, కాంక్రీట్‌ మిక్చర్‌ వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి... అనధికార పార్కింగ్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని