logo

తుపాను నష్టాలపై యంత్రాంగం ఆరా

మిగ్‌జాం తుపాను కారణంగా జిల్లాలో జరిగిన నష్టాలపై యంత్రాంగం ఆరా తీస్తోంది. తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పంటలకు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాలపై నివేదికలు అందజేయాలని మండల, డివిజన్‌ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

Updated : 07 Dec 2023 05:38 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను కారణంగా జిల్లాలో జరిగిన నష్టాలపై యంత్రాంగం ఆరా తీస్తోంది. తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పంటలకు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టాలపై నివేదికలు అందజేయాలని మండల, డివిజన్‌ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఆనందపురం, పెందుర్తి, భీమునిపట్నం, పద్మనాభం మండలాల పరిధిలో పలుచోట్ల పంటలు నీటిలో మునిగిపోయాయి. ఆనందపురం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగినట్లు కలెక్టరేట్‌కు సమాచారం అందింది. మిగిలిన మూడు మండలాల నుంచి నివేదికలు రావాల్సి ఉంది. పెదగంట్యాడ మండల పరిధిలో ఓ ఇంటి గోడ కూలిందని, ఎవరూ గాయపడలేదని సమాచారం అందింది. ఇతర ప్రాంతాల్లో తుపాను నష్టాలపై ఇప్పుడిప్పుడే నివేదికలు అందుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గినప్పటికీ గురువారం ఉదయం వరకు నియంత్రణ గదులను కొనసాగించాలని యంత్రాంగం నిర్ణయించింది.

బుధవారం ఉదయం సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి తుపాను కారణంగా తలెత్తిన పరిస్థితులపై సమీక్ష జరిపారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు