logo

అడుగడుగునా ఆంక్షలు...!

విశాఖ సాగర తీరంలో వివిధ దేశాల నావికాదళ విన్యాసాలు, కవాతును వీక్షించేందుకు నగరవాసులు కష్టపడాల్సి వచ్చింది.

Published : 23 Feb 2024 02:37 IST

పాస్‌లు లేని వారికి తప్పని కష్టాలు
తీరప్రాంత మార్గాలు మూసివేత

సిరిపురం పెట్రోల్‌ బంక్‌ వద్ద వాహనదారులను ప్రశ్నిస్తున్న పోలీసులు

ఎంవీపీకాలనీ, మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విశాఖ సాగర తీరంలో వివిధ దేశాల నావికాదళ విన్యాసాలు, కవాతును వీక్షించేందుకు నగరవాసులు కష్టపడాల్సి వచ్చింది. ఆర్కే బీచ్‌ తీరంలో జరుగుతున్న మిలాన్‌-24 విన్యాసాలకు సంబంధించి పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రముఖులు హాజరైన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు.

బీచ్‌రోడ్డులోకి వెళ్లకుండా స్టాపర్ల ఏర్పాటు

ఆర్కే బీచ్‌ నుంచి జీవీఎంసీ మ్యూజియం వరకు ఇరువైపులా ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. కేవలం పాసులు ఉన్నవారిని మాత్రమే పంపించారు. ఇక ద్విచక్రవాహనాలు, కార్లను ఒప్పుకోలేదు. సాధారణ ప్రజలను మాత్రం పార్కు హోటల్‌ నుంచి బీచ్‌ వైపు అనుమతించారు. మిగిలిన మార్గాలను మూసివేశారు.

అంబికా సీ గ్రీన్‌ హోటల్‌ మార్గంలో పోలీసులతో వాగ్వాదం

సిరిపురం, సీఆర్‌రెడ్డి కూడలి, ఏయూ అవుటు గేటు కూడలి, చినవాల్తేరు, కొటక్‌ స్కూలు కూడలి, పార్కు హోటల్‌ కూడళ్లలో పోలీసులు, నేవీ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు. వాహనాల పార్కింగ్‌ వివరాలను బోర్డుల రూపంలో ఉంచినా వీటిని గమనించని వారు ఈ మార్గాల్లో రావటానికి ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

కిర్లంపూడి లేఅవుట్‌లోకి అనుమతించని పోలీసులు

ఇక కిర్లంపూడి లేఅవుÆటు నుంచి బీచ్‌ రోడ్డుకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేయడంతో పాసులు లేని వారు చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. దీంతో ఆయా పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని