logo

ప్రొటోకాల్‌ కుర్చీ మడతపెట్టడంతో మంత్రికి షాక్‌

విశాఖకు వీఐపీలు ఎవరు వచ్చినా.. వారికి స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్‌ బాధ్యతల నుంచి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం జగన్‌ తప్పించడంతో మతిభ్రమించి ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ విమర్శించారు.

Published : 23 Feb 2024 02:41 IST

పోస్టు డబ్బా వద్ద కోడిగుడ్లు చూపుతున్న బాలాజీ తదితరులు

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: విశాఖకు వీఐపీలు ఎవరు వచ్చినా.. వారికి స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్‌ బాధ్యతల నుంచి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం జగన్‌ తప్పించడంతో మతిభ్రమించి ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ విమర్శించారు. ప్రొటోకాల్‌ కుర్చీని సీఎం మడతపెట్టడంతో కోడిగుడ్డు మంత్రి షాక్‌ నుంచి కోలుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పట్టణంలోని తపాలా కార్యాలయం నుంచి మంత్రి అమర్‌నాథ్‌కు గురువారం కోడిగుడ్లు పోస్టల్‌లో పంపారు. అనంతరం బాలాజీ మాట్లాడుతూ.. కోడిగుడ్డు మంత్రికి అనకాపల్లి టికెట్‌ కూడా లేకుండాపోయిందన్నారు. ఇటీవల సీఎం కుర్చీలో కూర్చుని అధికారులతో సమీక్ష నిర్వహించడం వల్లే అమర్‌పై జగన్‌కు కోపం వచ్చి కుర్చీని మడత పెట్టారన్నారు. నాయకులు కర్రి బాబీ, జగ్గారావు, సత్యనారాయణ, సూర్య, విజయ్‌, పృథ్వీ, ప్రదీప్‌, హరీశ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని