logo

వైకాపా ప్రచార యావ.. మహిళలకు ఇక్కట్లు

అధికార వైకాపాకు నవరత్నాల పథకాలపై ప్రచార పిచ్చి తారాస్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐప్యాక్‌ బృందాలతో రహదారులపై వీడియో షూటింగ్‌ చేయిస్తూ.. స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది.

Published : 23 Feb 2024 02:44 IST

ఉడ్‌పేట యూనియన్‌ బ్యాంకు వద్ద చేయూత పథకంపై మహిళలతో మాట్లాడించి చిత్రీకరిస్తున్న ఐప్యాక్‌ టీం

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: అధికార వైకాపాకు నవరత్నాల పథకాలపై ప్రచార పిచ్చి తారాస్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐప్యాక్‌ బృందాలతో రహదారులపై వీడియో షూటింగ్‌ చేయిస్తూ.. స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అనకాపల్లి పట్టణంలో గురువారం ఐప్యాక్‌ టీం వీడియో చిత్రీకరణ పేరుతో కొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. స్థానిక ఉడ్‌పేట యూనియన్‌ బ్యాంకు వద్ద చేయూత పథకంపై రోడ్డుపై షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. వివిధ పనులపై బ్యాంకుకు వచ్చిన మహిళలను మాట్లాడాలంటూ బలవంతపెట్టారు. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అని పదే పదే చెప్పమనడంతో మహిళలు విస్తుపోయారు. కొందరు మహిళలు అలా చెప్పడం ఇష్టం లేక అక్కడ్నుంచి వెళ్లిపోతుండటంతో ఐప్యాక్‌ టీం సభ్యులు వారిని అనుసరిస్తూ.. మాట్లాడాలంటూ ఇబ్బంది పెట్టారు. చేయూత బటన్‌ నొక్కి రోజులు గడుస్తున్నా.. డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమ చేయనప్పుడు ఇలాంటి వీడియో షూటింగ్‌లు ఎందుకని మహిళలు మండిపడ్డారు.

వెళ్లిపోతున్న మహిళలతో మాట్లాడుతున్న ఐప్యాక్‌ టీం సభ్యుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని