logo

గంజి అన్నం తింటూ తెలుగు మహిళల నిరసన

తెదేపా కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో గురువారం జగన్‌ పాలన పట్ల వినూత్నంగా నిరసన తెలిపారు.

Published : 23 Feb 2024 02:46 IST

నిరసనలో పాల్గొన్న మహిళలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో గురువారం జగన్‌ పాలన పట్ల వినూత్నంగా నిరసన తెలిపారు. నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో జగన్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఫలితంగా గంజి అన్నమే ఇక దిక్కు అంటూ నిరసన కొనసాగించారు. జగన్‌ను నేను ఎందుకు నమ్మాలి? నిత్యావసర వస్తువుల ధరలను పెంచినందుకా? అని మహిళలు ప్రశ్నించారు. అక్కడే అన్నం వండి చిప్పలో గంజి అన్నం తింటూ నిరసన తెలిపారు. జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు గంజి అన్నమే దిక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెదేపా తెలుగు మహిళా విభాగ అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ పేదల బతుకులను సీఎం జగన్‌ నాశనం చేశారని, రాష్ట్రాన్ని, కుటుంబాలను అప్పుల పాల్జేసి తను ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ను నమ్ముకుంటే భవిష్యత్తులో గంజి అన్నమే దిక్కన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగ ప్రతినిధులు రామలక్ష్మి, కాసులమ్మ, గృహలక్ష్మి, గోవిందమ్మ, పద్మ, వెంకటలక్ష్మి, రాగిణి, రామదేవి, రాణి, పుష్ప, ప్రమీల, సౌజన్య, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని