logo

‘ఘోషా’లో సౌర వెలుగులు

పాతనగరంలోని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి (ఘోషా) ఆవరణలో ఉన్న లాజరస్‌ వార్డులో సౌర విద్యుత్తు ప్లాంటు కొలువుదీరింది.

Published : 23 Feb 2024 02:47 IST

లాజరస్‌ వార్డుపై ఏర్పాటు చేసిన సౌర పలకలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పాతనగరంలోని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి (ఘోషా) ఆవరణలో ఉన్న లాజరస్‌ వార్డులో సౌర విద్యుత్తు ప్లాంటు కొలువుదీరింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఆర్సిలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీలు ఇండియా లిమిటెడ్‌ (ఏఎంఎన్‌ఎస్‌) సంస్థ 80 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన ప్లాంటును ఏర్పాటు చేసింది. దీని ద్వారా నెలకు 8-9 వేల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. తద్వారా ఘోషాస్పత్రిపై విద్యుత్తు రూపేణ అయ్యే ఖర్చుల భారం గణనీయంగా తగ్గనుంది. ఇటీవలే కేజీహెచ్‌లో ఏఎంఎన్‌ఎస్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ కింద సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేసింది. కలెక్టర్‌ మల్లికార్జున వినతి మేరకు ఇప్పుడు ఘోషాస్పత్రిలో సైతం ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్తు ప్లాంటును ఈనెల 23వ తేదీ శుక్రవారం కలెక్టర్‌ మల్లికార్జున ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని