logo

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సిబ్బంది నిర్లక్ష్యంతో మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సమాఖ్య, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్ చేశారు.

Published : 23 Feb 2024 20:00 IST

పాడేరు పట్టణం: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సిబ్బంది నిర్లక్ష్యంతో మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సమాఖ్య, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్ చేశారు. జి.మాడుగుల కేజీబీవీలో ఎనిమిదో తరగతి విద్యార్థిని వంతాల రాణి జనవరి 18వ తేదీన అనారోగ్యంతో మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన విద్యార్థిని వంతాల రాణి తల్లిదండ్రులు సుబ్బారావు, మంగమ్మ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద వివరాలు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం గిరిజన సమాఖ్య, ఏ.ఐ.ఎస్.ఎఫ్ నేతలతో జిల్లా విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేయడానికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు వంతాల కృష్ణారావు, మర్రి దాసు, సీదరి జగబంధు, కుటుంబ సభ్యుడు పాంగి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని