logo

గ్రామకంఠం స్థలం స్వాధీనం అడ్డగింత

‘గొంపలో వైకాపా నేతల బరితెగింపు’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది.

Published : 24 Feb 2024 03:05 IST

రావికమతం, న్యూస్‌టుడే: ‘గొంపలో వైకాపా నేతల బరితెగింపు’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది. స్పందించిన తహసీల్దారు ఎస్‌.రమణారావు ఆ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవడంతోపాటు ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని వీఆర్వో అప్పారావును ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి సతీష్‌, సచివాలయ, రెవెన్యూ సిబ్బందితో గొంప చేరుకున్న వీఆర్వోను పిల్లా, తోట కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.  కార్యదర్శి సతీష్‌ పేర్కొంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయగా.. పిల్లా, తోట కుటుంబాలకు చెందిన వ్యక్తులు దాన్ని తొలగించారు. దీనిపై రెవెన్యూ, పంచాయతీ సిబ్బందికి, వారికి వాగ్వాదం చోటుచేసుకుంది. హెచ్చరిక బోర్డు ఏర్పాటును అడ్డుకున్న విషయం తహసీల్దారు, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి సతీష్‌, వీఆర్వో అప్పారావు పేర్కొన్నారు. ‘సర్వే నంబరు 61లోని ఐదు సెంట్ల గ్రామకంఠం మా పూర్వీకులు పంచాయతీ భవన నిర్మాణానికి దానంగా ఇచ్చారు. ఇప్పటివరకు భవన నిర్మాణం చేయకపోవడంతో ఈ స్థలం మాకే చెందుతుంద’ని తోట సునీల్‌, రామారావు, పిల్లా గోవింద వెల్లడించారు.   ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డు పెట్టేందుకు వీల్లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని