logo

బడిలో బాజాలు.. చదువులెలా మాస్టారూ..!

పాఠశాలలో పెళ్లివేడుకను ఏర్పాటుచేసి తరగతులకు ఆటంకం కలిగించిన సంఘటన అచ్యుతాపురం మండలం కొండకర్లలో శుక్రవారం జరిగింది.

Published : 24 Feb 2024 03:15 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పాఠశాలలో పెళ్లివేడుకను ఏర్పాటుచేసి తరగతులకు ఆటంకం కలిగించిన సంఘటన అచ్యుతాపురం మండలం కొండకర్లలో శుక్రవారం జరిగింది. తరగతులు జరిగే సమయంలో పాఠశాలలో ఇటువంటి వేడుకలను ఏర్పాటు చేయకూడదని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారించినా పట్టించుకోలేదు. ‘మా మాట వినకపోతే పాఠశాలను ఏవిధంగా నడుపుతారో చూస్తామ’ని బెదిరించి మరీ పాఠశాల ఆవరణలో భారీ పెళ్లి మండపాన్ని ఏర్పాటు చేశారు.

రెండు రోజుల పాటు జరిగిన పెళ్లి నిర్వహణతో విద్యార్థుల తరగతులకు ఇబ్బందిగా మారింది. కొండకర్లలో ఎటువంటి కార్యక్రమం జరిగినా పాఠశాల ఆవరణలో ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో పెళ్లి వేదిక వద్దని వారించినా వినకపోవడంతో ఎంఈఓ, ఎంపీడీఓలకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు