logo

సెంట్రల్‌ పార్కు కళ తప్పింది

నగర నడిబొడ్డున ఉన్న సెంట్రల్‌ పార్కు కళ తప్పింది. సందర్శకుల నుంచి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నా.. సౌకర్యాల మెరుగుదలకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు.

Published : 24 Feb 2024 03:23 IST

ఈనాడు, విశాఖపట్నం: నగర నడిబొడ్డున ఉన్న సెంట్రల్‌ పార్కు కళ తప్పింది. సందర్శకుల నుంచి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నా.. సౌకర్యాల మెరుగుదలకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. చిన్న పిల్లలకోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు దెబ్బతిన్నాయి. దీప స్తంభాలు వెలవెలబోతున్నాయి. నడకదారి దెబ్బతింది. పచ్చదనం కోల్పోయిన గార్డెన్లు, కళాకృతులు కళ తప్పాయి. బోన్సాయి వనంలో మొక్కల కుండీలు దెబ్బతిన్నాయి. పార్కు మధ్య ప్రాంతంలో కనీసం పచ్చదనం లేక పోవడమేకాక వ్యర్థాలను తగులబెట్టడంతో బూడిద దర్శనమిస్తోంది. ప్రధాన బస్‌స్టాండు దగ్గర్లో ఉండటంతో నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. దానికి తగ్గట్లుగా ఇక్కడ సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులు పెదవి విరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు