logo

నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఓ చిన్నారిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న ఆ బాలుడికి సంబంధించి బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా..

Published : 24 Feb 2024 03:26 IST

ఆనందపురం, న్యూస్‌టుడే: ఓ చిన్నారిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న ఆ బాలుడికి సంబంధించి బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా.. ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన తోమురోతు హరిత కుమారుడు కుశాల్‌ చంద్రశేఖర్‌ నాయుడు(4) ఈనెల 21వ తేదీన (బుధవారం) సాయంత్రం వేళ ఇంటికి సమీపంలో ఉన్న పశువుల కళ్లానికి ఒంటరిగా వెళ్తున్నాడు. మార్గ మధ్యలో వీధి కుక్కలు దాడి చేసి పక్కనున్న ఇటుకల బట్టీలోకి బాలుడిని ఈడ్చుకెళ్లాయి. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడి విశాఖలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, వారం రోజులు గడిస్తేనే ఏమైనా చెప్పగలమని వైద్యులు అంటున్నారని కుటుంబీకులు పేర్కొన్నారు. ఆ సమయంలో కొన్ని ఆసుపత్రులు బాలుడికి వైద్య సాయం అందించేందుకు నిరాకరించాయని వారు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని