logo

రూ. 80 లక్షలతో.. పిల్లల వార్డు నవీకరణ

కేజీహెచ్‌లోని పిల్లల వార్డును రూ.80లక్షలతో నవీకరిస్తున్నారు. 40 పడకలతో కూడిన పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (పీఐసీయూ)లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Published : 24 Feb 2024 03:30 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లోని పిల్లల వార్డును రూ.80లక్షలతో నవీకరిస్తున్నారు. 40 పడకలతో కూడిన పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (పీఐసీయూ)లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాది వయసు నుంచి ఏడేళ్ల వయసు ఉన్న చిన్నారులకు ఇక్కడ వైద్య సేవలు అందించనున్నారు. వెంటిలేటర్లు, ఇంకుబేటర్లు, ఇతర అత్యాధునిక వైద్య పరికరాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్‌ సీఎస్‌ఆర్‌ నిధి నుంచి రూ.40లక్షలు విడుదల చేయగా, ఆంధ్ర వైద్య కళాశాల, కేజీహెచ్‌ చెరో రూ.20లక్షల చొప్పున రూ.40 లక్షలు సమకూర్చాయని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి నవీకరించిన ఐపీసీయూ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని