logo

క్రీడాకారులతో రాజకీయాలేంటి: గంటా

స్వయం కృషితో ఎదిగి మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులతో ఈ రాజకీయాలు ఏంటి జగన్‌మోహన్‌రెడ్డి గారు.. అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం తన ఎక్స్‌ ద్వారా దుయ్యబట్టారు.

Published : 28 Feb 2024 03:58 IST

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: స్వయం కృషితో ఎదిగి మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులతో ఈ రాజకీయాలు ఏంటి జగన్‌మోహన్‌రెడ్డి గారు.. అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం తన ఎక్స్‌ ద్వారా దుయ్యబట్టారు. వైకాపా నేతలు రాజారెడ్డి రాజ్యాంగాన్ని క్రికెట్‌లో కూడా అమలు చేస్తున్నారు. పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి రాష్ట్రంలో నిరుద్యోగం పెంచేశారు. అలాగే క్రీడాకారులను కూడా తరిమేందుకు సిద్ధమయ్యారా? విహారికి తక్షణమే క్షమాపణలు చెప్పి తిరిగి కెప్టెన్సీ ఇచ్చి రాష్ట్ర క్రీడాభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్‌ చేస్తున్నానని పేర్కొన్నారు.


ఆంధ్రాను వీడుతున్న పారిశ్రామిక వేత్తలు.. ఆటగాళ్లు

ఉషోదయకూడలి(ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే : పారిశ్రామికవేత్తలే కాదు.. కాదు, క్రీడాకారులు కూడా ఆంధ్రాను వీడుతున్నారని తెదేపా విశాఖ పార్లమెంటరీ ఇన్‌ఛార్జి శ్రీభరత్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. వైకాపా నేతల రాజకీయ క్రీడలో హనుమ విహారీకి ఘోర అవమానం జరిగిందన్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ నిధులు దుర్వినియోగం చేయటం మినహా క్రీడాకారులకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. క్రికెట్‌లో ఇలాంటి విష సంస్కృతి మంచిది కాదన్నారు. వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.


క్రికెట్పై రాజకీయాలు దురదృష్టకరం: ఏసీఏ

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ‘జెంటిల్‌మెన్‌ గేమ్‌’గా గుర్తింపు పొందిన క్రికెట్పై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ (ఏసీˆఏ) పేర్కొంది. ఈ మేరకు ఏసీˆఏ మీడియా మేనేజర్‌ డి.రాజగోపాల్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సీˆనియర్‌ క్రికెటర్‌ హనుమ విహారి సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన విమర్శలను ఆసరాగా తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు.. అసోసియేషన్‌ నాయకత్వం, మేనేజ్‌మెంట్పై ఆరోపణలు చేయడం బాధాకరం. జట్టు సభ్యులు మద్దతు తెలిపినా కెప్టెన్‌గా తొలగించారని విహారి చేసిన వ్యాఖ్యలు అవాస్తవం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు