logo

విశాఖలో డేటా సెంటర్‌ నిర్మించాలి

రక్షణశాఖకు చెందిన అన్ని కార్యాలయాలు ఒకే చోట పనిచేసేలా ‘సమీకృత డిఫెన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం (ఏపీఏటీఏ) ప్రతినిధులు మంగళవారం విశాఖ వచ్చిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు.

Published : 28 Feb 2024 04:00 IST

మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు చిత్రపటం అందిస్తున్న ఏపీఏటీఏ ప్రతినిధులు, తదితరులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పెదవాల్తేరు: రక్షణశాఖకు చెందిన అన్ని కార్యాలయాలు ఒకే చోట పనిచేసేలా ‘సమీకృత డిఫెన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం (ఏపీఏటీఏ) ప్రతినిధులు మంగళవారం విశాఖ వచ్చిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. ‘‘డాక్‌యార్డ్‌, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ తదితర రక్షణ విభాగాలు విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి. రక్షణ ప్రయోజనాల కోసం విశాఖలో డేటా సెంటర్‌, స్థానికంగా ఏవియేషన్‌ విశ్వవిద్యాలయం, అరకు, పాడేరులో ప్రత్యేక బలగాల శిక్షణకు సౌకర్యాలు ఏర్పాటుచేయాలి. రక్షణ సంస్థల అవసరాలను తీర్చడానికి స్వచ్ఛమైన నీరు అందించే ప్రధాన డీశాలినేషన్‌ ప్లాంట్‌, విద్యుత్తు అవసరాలను తీర్చడానికి గ్రీన్‌ ఎనర్జీ పార్కులు నిర్మించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఏపీఏటీఏ ఉపాధ్యక్షుడు ఓ.నరేష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

 ఆవిష్కరణలు, ఉపాధికి గ్లోబల్‌ హబ్‌గా మారడానికి విశాఖకు అద్భుతమైన అవకాశాలున్నాయని ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల అవసరాలకు అనుగుణంగా 200 ఎకరాల్లో డిఫెన్స్‌, మారిటైం పార్కు ఏర్పాటుచేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. సంఘం విశాఖ జోన్‌ ఛైర్మన్‌ చిట్టూరి శ్రీనాథ్‌, మాజీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్‌, ఈసీ సభ్యులు సుధీర్‌, కుమార్‌ రాజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని