logo

Godavari Express: సాధారణ బోగీలో సగం తపాలాకు..!

అన్ని రైళ్లలో సాధారణ, స్లీపర్‌ బోగీలు తగ్గిపోతూ, ఏసీ బోగీలు పెరిగిపోతున్నాయి. గతంలో 10, 12 స్లీపర్‌ బోగీలు ఉండగా ఇప్పుడా సంఖ్య సగానికి తగ్గిపోయింది. దీంతో ఎన్నడూ లేని విధంగా అవి ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.

Updated : 29 Feb 2024 07:14 IST

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల పాట్లు

సాధారణ బోగీలో తపాలాశాఖకు కేటాయించిన అర బోగీ ఇదే

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: అన్ని రైళ్లలో సాధారణ, స్లీపర్‌ బోగీలు తగ్గిపోతూ, ఏసీ బోగీలు పెరిగిపోతున్నాయి. గతంలో 10, 12 స్లీపర్‌ బోగీలు ఉండగా ఇప్పుడా సంఖ్య సగానికి తగ్గిపోయింది. దీంతో ఎన్నడూ లేని విధంగా అవి ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక సాధారణ బోగీలు అయితే ఒకటి, రెండు మాత్రమే ఉంటున్నాయి. వాటిల్లో నిల్చోవడం కూడా కష్టంగా మారుతోంది. లగేజీ పెట్టుకోవడానికి స్థలం లేక ప్రయాణికులు తలలపైనే ఉంచుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోవలోకి విశాఖ-హైదరాబాద్‌ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ చేరింది. ఈ రైలు వెనక ఒక సాధారణ బోగీతో పాటు లగేజి కమ్‌ దివ్యాంగుల బోగీ ఉంది. ఇటీవల సాధారణ బోగీలో సగం తపాలా శాఖకు కేటాయించడంతో ప్రయాణికుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు 8వ నంబరు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన ఈరైలు వెంట పలువురు ప్రయాణికులు ప్రమాదకరంగా పరుగులు తీశారు. రెండు గంటల తర్వాత సాయంత్రం 5.25గంటలకు స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరింది. ఈ సమయానికి కనీసం కాలు మోపడానికి అవకాశం లేకుండా పోయింది. గతంలో తపాలాకు ప్రత్యేకంగా బోగీ ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించి సాధారణ బోగీలో సగం కేటాయించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని