logo

రాజీనామాలు చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు..

‘ప్రస్తుతానికి వాలంటీర్లంతా రాజీనామా చేసి ఈ రెండు నెలలు పార్టీ విజయానికి పని చేయండి. నెలకు రూ.10 వేలు పారితోషికంగా ఇస్తాం. వైకాపా గెలిస్తే అప్పుడు మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. 

Published : 03 Apr 2024 03:26 IST

వాలంటీర్లను హెచ్చరించిన వైకాపా ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌!

పెందుర్తి, న్యూస్‌టుడే: ‘ప్రస్తుతానికి వాలంటీర్లంతా రాజీనామా చేసి ఈ రెండు నెలలు పార్టీ విజయానికి పని చేయండి. నెలకు రూ.10 వేలు పారితోషికంగా ఇస్తాం. వైకాపా గెలిస్తే అప్పుడు మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. ఒకవేళ రాజీనామా చేయకపోతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ వాలంటీర్లను హెచ్చరించినట్లు నియోజకవర్గం వాలంటీర్ల వర్గాల్లో చర్చ నడుస్తోంది. పెందుర్తి అర్బన్‌ పరిధిలోని పలు వార్డు వాలంటీర్లతో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ మంగళవారం తన గ్రామంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి హెచ్చరించడంపై పలువురు వాలంటీర్లు భయాందోళన చెందుతున్నారు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏమిటని వేపగుంట ప్రాంతానికి చెందిన ఓ వాలంటీరు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని మరికొందరు వాలంటీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో అర్బన్‌ పరిధిలో కూడా వాలంటీర్ల రాజీనామాలు ఉంటాయని, ఈ నేపథ్యంలోనే వారితో ముందస్తు సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని