logo

పవన్‌ పర్యటన 5న

జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఈనెల 5న అనకాపల్లిలో పర్యటించనున్నారని కూటమి జనసేన అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 30న వారాహి విజయభేరి జైత్రయాత్ర ప్రారంభించారన్నారు.

Published : 03 Apr 2024 03:29 IST

మాట్లాడుతున్న కొణతాల రామకృష్ణ, చిత్రంలో పీలా గోవింద్‌ సత్యనారాయణ, అప్పారావు తదితరులు

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఈనెల 5న అనకాపల్లిలో పర్యటించనున్నారని కూటమి జనసేన అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 30న వారాహి విజయభేరి జైత్రయాత్ర ప్రారంభించారన్నారు. మొదటివిడతగా ఉత్తరాంధ్రలో 4న నెల్లిమర్ల, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్‌ ప్రచార కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనకాపల్లిలో రోడ్‌ షో, బహిరంగ సభ ఉంటుందన్నారు. కార్మికులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు అందరూ వచ్చి విజయవంతం చేయాలన్నారు. అనకాపల్లిలో స్థానిక సమస్యలపై మాట్లాడుతారన్నారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, స్టీల్‌ప్లాంట్ చక్కెర కర్మాగారాల మూత తదితర అంశాలపై మాట్లాడుతారన్నారు. ఆర్‌ఈసీఎస్‌ను గతంలో మాదిరిగానే కోఆపరేటివ్‌ సొసైటీలో కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ భవనాలు ఒకే సముదాయంలో ఉండేలా, జిల్లా కోర్టు నిర్మాణం చేపట్టేలా పవన్‌ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ పవన్‌ సుంకరమెట్ట కూడలి నుంచి నెహ్రూ చౌక్‌ కూడలి వరకు రోడ్‌షో ఉంటుందన్నారు. అనంతరం కూడలిలో బహిరంగ సభలో మాట్లాడుతారన్నారు. పార్లమెంట్ బరిలో ఉన్న సీఎం రమేశ్‌ సైతం ఏర్పాట్లపై చర్చిస్తున్నారన్నారు. భాజపా నాయకుడు పొన్నగంటి అప్పారావు మాట్లాడుతూ పవన్‌ రోడ్‌ షో, బహిరంగ సభను భాజపా శ్రేణులతో కలిసి విజయవంతం చేస్తామన్నారు. తెదేపా నాయకులు మళ్ల సురేంద్ర, నారాయణరావు, రాష్ట్ర దళిత సేన, మాల మహానాడు అధ్యక్షులు పాల్తేటి పెంటారావు, జనసేన నాయకులు బుదిరెడ్డి చిన్న, తాడి రామకృష్ణ, గెంజి సత్యారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని