logo

వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్‌పై కేసు నమోదు

ఓ వ్యాపారిపై విచక్షణ రహితంగా దాడిచేసిన ఘటనలో వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్‌పై విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. అక్కయ్యపాలేనికి చెందిన సురేష్‌ అనే వ్యక్తి 80 అడుగుల రోడ్డులో సీయన్‌ అనే సంస్థ పేరుతో బంగారంపై రుణాలు ఇస్తుంటారు.

Published : 03 Apr 2024 03:35 IST

చంపేస్తానంటూ బాధితుడికి బెదిరింపులు

చెల్లని చెక్కులు, ఫిర్యాదు లేఖను చూపిస్తున్న బాధితుడు డి.సురేష్‌

గురుద్వారా, అక్కయ్యపాలెం - న్యూస్‌టుడే: ఓ వ్యాపారిపై విచక్షణ రహితంగా దాడిచేసిన ఘటనలో వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్‌పై విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. అక్కయ్యపాలేనికి చెందిన సురేష్‌ అనే వ్యక్తి 80 అడుగుల రోడ్డులో సీయన్‌ అనే సంస్థ పేరుతో బంగారంపై రుణాలు ఇస్తుంటారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... తన వద్ద కొన్ని నెలల కిందట 89వ వార్డు వైకాపా అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి కిరణ్‌ సుమారు 80 తులాల బంగారం తాకట్టుపెట్టి అప్పుగా రూ.61లక్షలు తీసుకున్నారు. వడ్డీ చెల్లించాలని కోరగా కొన్ని రోజుల క్రితం రూ.10లక్షలు.. రూ.6లక్షల చొప్పున రెండు చెల్లని చెక్‌లు తనకు ఇచ్చినట్లు బాధితుడు అక్కయ్యపాలెంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. చెల్లని చెక్‌లు ఇచ్చి, అసలుగా తీసుకున్న డబ్బులు ఏమీ చెల్లించకుండానే బంగారం తిరిగి ఇవ్వాలంటూ దొడ్డి కిరణ్‌ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. డబ్బుల కోసం ఫోన్‌ చేస్తే దురుసుగా మాట్లాడటం మొదలు పెట్టారని, మార్చి 27న తన కార్యాలయానికి వచ్చి కిరణ్‌ విచక్షణరహితంగా ప్లాస్టిక్‌ పైపుతో దాడి చేశారన్నారు. ఈ ఘటనలో తన వీపుపై తీవ్ర గాయాలవ్వడంతో, అదేరోజు కేజీహెచ్‌లో తగిలిన గాయాలకు ఎమ్మెల్సీ చేయించుకుని, నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో దొడ్డి కిరణ్‌ దాడికి పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు. గతంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన సోదరుడి నుంచి రూ.4 లక్షలు తీసుకుని కిరణ్‌ తిరిగి ఇవ్వలేదని సురేష్‌ మీడియాకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేసి చంపుతానంటూ దొడ్డి కిరణ్‌ బెదిరిస్తున్నారన్నారు. ‘ప్రాణ హాని ఉంది, రక్షణ కల్పించాలి’ అంటూ సురేష్‌ సీపీకి విన్నవించారు.వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్‌పై కేసు నమోదు

గురుద్వారా, అక్కయ్యపాలెం - న్యూస్‌టుడే: ఓ వ్యాపారిపై విచక్షణ రహితంగా దాడిచేసిన ఘటనలో వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్‌పై విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. అక్కయ్యపాలేనికి చెందిన సురేష్‌ అనే వ్యక్తి 80 అడుగుల రోడ్డులో సీయన్‌ అనే సంస్థ పేరుతో బంగారంపై రుణాలు ఇస్తుంటారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... తన వద్ద కొన్ని నెలల కిందట 89వ వార్డు వైకాపా అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి కిరణ్‌ సుమారు 80 తులాల బంగారం తాకట్టుపెట్టి అప్పుగా రూ.61లక్షలు తీసుకున్నారు. వడ్డీ చెల్లించాలని కోరగా కొన్ని రోజుల క్రితం రూ.10లక్షలు.. రూ.6లక్షల చొప్పున రెండు చెల్లని చెక్‌లు తనకు ఇచ్చినట్లు బాధితుడు అక్కయ్యపాలెంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. చెల్లని చెక్‌లు ఇచ్చి, అసలుగా తీసుకున్న డబ్బులు ఏమీ చెల్లించకుండానే బంగారం తిరిగి ఇవ్వాలంటూ దొడ్డి కిరణ్‌ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. డబ్బుల కోసం ఫోన్‌ చేస్తే దురుసుగా మాట్లాడటం మొదలు పెట్టారని, మార్చి 27న తన కార్యాలయానికి వచ్చి కిరణ్‌ విచక్షణరహితంగా ప్లాస్టిక్‌ పైపుతో దాడి చేశారన్నారు. ఈ ఘటనలో తన వీపుపై తీవ్ర గాయాలవ్వడంతో, అదేరోజు కేజీహెచ్‌లో తగిలిన గాయాలకు ఎమ్మెల్సీ చేయించుకుని, నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో దొడ్డి కిరణ్‌ దాడికి పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు. గతంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన సోదరుడి నుంచి రూ.4 లక్షలు తీసుకుని కిరణ్‌ తిరిగి ఇవ్వలేదని సురేష్‌ మీడియాకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేసి చంపుతానంటూ దొడ్డి కిరణ్‌ బెదిరిస్తున్నారన్నారు. ‘ప్రాణ హాని ఉంది, రక్షణ కల్పించాలి’ అంటూ సురేష్‌ సీపీకి విన్నవించారు.

వేటు వేసినట్లే వేసి వెంట తిప్పుకొంటూ...

భూకబ్జాల వివాదంలో ఉన్న దొడ్డి కిరణ్‌ గతంలో చెరువు భూముల ఆక్రమణ విషయంలో సర్వే చేయడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులపై దాడి చేశారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో దొడ్డి కిరణ్‌ ఏకంగా సాయిరెడ్డికి శిలా విగ్రహం ఏర్పాటు చేసి స్వామి భక్తి చాటుకున్నారు. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా వైవీ బాధ్యతలు తీసుకున్నాక, 89వ వార్డు వైకాపా అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి కిరణ్‌పై ఆ పార్టీ గతేడాది మే 13న సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది. వేటు పడినా దొడ్డి కిరణ్‌ వైకాపా నేతల వెంటే ఉంటున్నారు. బడా నేతల పేర్లు చెప్పుకొంటూ అక్రమాలకు పాల్పడుతున్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని