logo

వైకాపా ప్రచారంలో పాల్గొన్న పీఏసీఎస్‌ కార్యదర్శి సస్పెన్షన్‌

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైకాపా ప్రచారంలో పాల్గొన్న విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మజ్జివలస ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) కార్యదర్శి గల్లా రామకృష్ణను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 03 Apr 2024 03:37 IST

ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గల్లా రామకృష్ణ (వృత్తంలో ఉన్న వ్యక్తి)

పద్మనాభం, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైకాపా ప్రచారంలో పాల్గొన్న విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మజ్జివలస ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) కార్యదర్శి గల్లా రామకృష్ణను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26వ తేదీన పద్మనాభం మండలం గంధవరం గ్రామంలో భీమిలి  వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో రామకృష్ణ పాల్గొనడంతో మిగిలిన రాజకీయ పార్టీల నేతలు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాక రామకృష్ణను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని