logo

‘అబద్ధాలు జగన్‌కు కొత్తేమీ కాదు’

అబద్ధాలు చెప్పడం సీఎం జగన్‌కు కొత్తేమీ కాదని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.రూ.200 ఉన్న పింఛనును తెదేపా పాలనలో రూ.2వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.

Published : 03 Apr 2024 03:39 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎం.శ్రీభరత్‌.. చిత్రంలో గండిబాబ్జీ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: అబద్ధాలు చెప్పడం సీఎం జగన్‌కు కొత్తేమీ కాదని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.రూ.200 ఉన్న పింఛనును తెదేపా పాలనలో రూ.2వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 ఎన్నికలకు ముందు రూ.3వేలకు పెంచుతానని చెప్పిన విడతలుగా అమలు చేసి జాప్యం చేశారని దుయ్యబట్టారు.

  • వాలంటీర్లు లేకుంటే పింఛన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని, దీన్ని అసమర్థÄతగా భావించాలన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో 10మంది వరకు సిబ్బంది ఉన్నారని, వారి సహాయంతో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. వాలంటీర్లలో కొంత మంది వైకాపా ఏజెంట్లుగా పని చేస్తున్నారని, వారు పదవికి రాజీనామా చేసి పార్టీకి సేవ చేస్తామంటే సహించేది లేదన్నారు. తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ మాట్లాడుతూ కోడ్‌ రాక ముందు రూ.13వేల కోట్లను జగన్‌ తన అనుయాయులకు పంపిణీ చేశారని, ఇప్పుడు పింఛన్ల పంపిణీకి డబ్బు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని దుయ్యబట్టారు. అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి రావాలని జగన్‌ కుట్రలు చేస్తున్నారని, వాటిని ప్రజలు తిప్పి కొడతారని పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని